Christmas | ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Christmas | ఘనంగా క్రిస్మస్ వేడుకలు
- యేసుక్రీస్తు జననం.. ప్రపంచానికి రక్షణ దినం
- ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య
Christmas | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యేసుక్రీస్తు జననం ప్రపంచానికి రక్షణ దినం అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లిలో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధనల స్ఫూర్తితో పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు.

