Bigg Boss-9 | తెలుగింటి ముద్ద‌మందారం…

Bigg Boss-9 | తెలుగింటి ముద్ద‌మందారం…

ఆంధ్రప్రభ : త‌నూజ‌ పుట్టస్వామి.. ఈ పేరు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వినిపిస్తున్న పేరు! కన్నడ బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించినా, తెలుగులో ‘ముద్దమందారం’ సీరియల్‌తో తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. తన నిండైన రూపంతో, స్వచ్ఛమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల Bigg Boss-9 రియాలిటీ షోలో అడుగుపెట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది.

బిగ్‌బాస్ హౌస్‌లో తనూజ ప్రయాణం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్‌ను తలపించింది. అక్కడ ఆమె చేసిన అల్లరి, చూపిన అలక, వేసిన ఎత్తుగడలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆటలో భాగంగా ఎన్నోసార్లు భావోద్వేగాలకు గురై కన్నీరు పెట్టుకున్న తనూజ, వ్యక్తిత్వం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంతో దృఢంగా నిలబడింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చిన ఆఫ‌ర్లు తోసిపుచ్చి ప్రేక్ష‌కుల నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని చెప్ప‌డంతో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది.

బిగ్‌బాస్ ట్రోఫీకి ద‌గ్గ‌ర వ‌ర‌కూ వెళ్లి ఓడినా.. తనూజ గెలిచిన‌ట్లే చెప్పొచ్చు. హౌస్‌లో ఉన్నప్పుడు చిన్న విషయాలకే కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్న ఆ సున్నితమైన మనసు, టైటిల్ చేజారినప్పుడు మాత్రం చిరునవ్వుతో ఆ ఓటమిని స్వీకరించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss – 9 Trophy | కళ్యాణ్ పడాల కి బిగ్ బాస్ ట్రోఫీ

ఒక్క కంటి చుక్క కూడా రాల్చకుండా ఆమె ప్రదర్శించిన ఆ మనోధైర్యం చూసి సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ట్రోఫీ కంటే ప్రజల ప్రేమే గొప్పదని నిరూపించిన ఈ ‘ముద్దమందారం’, బిగ్‌బాస్ తర్వాత బుల్లితెరపై, వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో, తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎలా ద‌గ్గ‌ర‌వుతుందో చూడాలి!

Leave a Reply