Temple | ఆదిత్యుని సన్నిధిలో చాగంటి

Temple | ఆదిత్యుని సన్నిధిలో చాగంటి
Temple | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రసిద్ద పుణ్యక్షేత్రం అరసవిల్లి లోని సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, భార్య సుబ్రహ్మణ్యేశ్వరి దేవాలయంనకు విచ్చేసి దర్శించుకున్నారు. ప్రత్యేక సూర్య నమస్కారాలు చేయించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయ అర్చకులు, వేద పండితలు చాగంటి దంపతులను ఆశీర్వదించారు. వారికి స్వామి వారి ప్రసాదాలను,చిత్రపటం అందజేశారు. .
