Kadem | కాంగ్రెస్ లోకి పెద్ద బెల్లాల్ సర్పంచ్

Kadem | కాంగ్రెస్ లోకి పెద్ద బెల్లాల్ సర్పంచ్

Kadem | కడెం, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అద్వర్యంలో ఇవాళ‌ కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి, గ్రామ‌పంచాయ‌తీ వార్డు సభ్యులు బత్తుల వంశీ, గడ్డం వరలక్ష్మి -రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ ఈదుల తిరుపతికి, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, బెల్లాల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కాల్వ తిరుపతి, నాయకులు కోడిపెల్లి గంగన్న, మైదం రమేష్, కోలా రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply