Bhuvanagiri | గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

Bhuvanagiri | గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా
- సర్పంచ్ టేకుల మంజులారెడ్డి
Bhuvanagiri | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే లక్ష్యంగా, పార్టీలకు అతీతంగా పనిచేస్తానని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం గ్రామ నూతన సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి తెలిపారు. నూతన గ్రామ మహిళా సర్పంచ్ గా బాధ్యతల చేపట్టిన మంజులా రెడ్డి ని మహిళలు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. మిఠాయిలు తినిపించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మంజుల రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల సందర్భంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకవర్గంతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు. ఒక మహిళగా పోటీ చేసిన తనను గ్రామ ప్రజలందరూ ఆదరించి, తనపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు గాను మంజులా రెడ్డి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ మంజులారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులతో పాటు బిజెపి, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
