Warangal | ఆదరించారు.. అభివృద్ధి చేసి చూపిస్తా

Warangal | ఆదరించారు.. అభివృద్ధి చేసి చూపిస్తా

  • రాయపర్తి నూతన సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి
  • కనుల పండుగగా ప్రమాణ స్వీకార మహోత్సవం

Warangal | రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి గ్రామ ప్రజలు నన్ను ఆదరించి గెలిపించారు స్థాయిని మించి గ్రామాన్ని అభివృద్ధి(Development) చేసి చూపిస్తానని రాయపర్తి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి అన్నారు. సోమవారం పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రత్యేక అధికారి తహసిల్దార్ ముల్కనూరి.శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్ నాయక్, గ్రామపంచాయతీ కార్యదర్శి వినోద్ ల ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి ఆయా పదవుల్లో కొలువుదీరారు.

అనంతరం నూతన సర్పంచ్ సహేంద్ర బిక్షపతి మాట్లాడుతూ.. రాయపర్తి గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా అన్నారు. గ్రామ పాలనలో అందరి అభిష్టం మేరకు పనిచేస్తా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ రమేష్, వార్డు మెంబర్లు, రాయపర్తి గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply