Revanth Reddy | నేడు కీలక సమావేశం..

Revanth Reddy | నేడు కీలక సమావేశం..
Revanth Reddy, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో.. పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. అలాగే మంత్రుల నియోజకవర్గాలు, వారు ఇన్ ఛార్జులుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాల గురించి.. ఆయా గ్రామాలు, మండలాలు, నియోకవర్గాల వారీ ఫలితాల గురించి చర్చించనున్నారని తెలిసింది.
ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాల పైన కూడా చర్చించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటుందని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అంశం గురించి.. అలాగే మంత్రుల పని తీరు గురించి చర్చించనున్నారని సమాచారం.
