Cricket Tournament | జాతీయ క్రికెట్ పోటీలు చిరస్థాయిగా నిలుస్తుంది

Cricket Tournament | జాతీయ క్రికెట్ పోటీలు చిరస్థాయిగా నిలుస్తుంది

Cricket Tournament | నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని జిల్లా ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్‌(All India Cricket Tournament)కు ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్‌గా న్యూ స్టార్ నాగర్ కర్నూల్ vs కిల్లర్ సీసీ చెన్నై జట్ల మ‌ధ్య జరిగిన పోటికి ఎమ్మెల్యే టాస్ వేసి మ్యాచ్‌ను అధికారికంగా ప్రారంభించారు.

క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత క్రీడల వైపు మరింతగా ఆకర్షితులవ్వాలని, క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ(Discipline), నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరపున, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

నాగర్ కర్నూల్ పట్టణాన్ని క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు, సీనియర్ క్రికెటర్లు, మాజీ కౌన్సిలర్లు, క్రీడాభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply