Nizampet | ప్రమాణ స్వీకారం ఎక్కడ?

Nizampet | ప్రమాణ స్వీకారం ఎక్కడ?

Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కాసింపూర్, షాకత్ పల్లి గ్రామపంచాయతీలు నూతనంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల స్థానిక ఎన్నికల్లో (Election) షాకత్ పల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే కాసింపూర్ గ్రామంలో 6 వార్డు సభ్యులు, ఒక గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఎన్నుకున్నారు.

ఈ రెండు నూతన గ్రామపంచాయతీల సభ్యులకు ప్రమాణం స్వీకారం చేసేందుకు గ్రామపంచాయతీ భవనాలు (Buildings) లేకపోవడం విడ్డూరంగా మారింది. వేలు ఖర్చు పెట్టి సర్పంచిగా గెలుపొందితే సర్పంచ్ పాలకవర్గం సమావేశానికి భవనం లేకపోవడం సమస్యగా మారింది. దీంతో నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం తాత్కాలికంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక రూమ్ ను కేటాయించుకొని ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామంలో ఏదైనా సమస్యలుంటే టెంటు వేసుకొని గ్రామసభలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. త్వరలోనే గ్రామపంచాయతీ భవనాల ఏర్పాటుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.