MP Byreddy Sabari | టీడీపీకి రుణ‌ప‌డి ఉంటా..

MP Byreddy Sabari | టీడీపీకి రుణ‌ప‌డి ఉంటా..

  • దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించింది
  • ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
  • సీఎం చంద్రబాబుకు బ్రిక్స్ 11వ సమావేశం ఆల్బమ్ అంద‌జేత‌

MP Byreddy Sabari | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం టీడీపీ క‌ల్పించింద‌ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబ‌రి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బ్రిక్స్ 11వ శిఖరాగ్ర సమావేశం ఆల్బమ్‌ను ఎంపీ అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రెజిల్ (బ్రాసీలియా)లో నిర్వహించిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ పుస్తకాన్ని సీఎం ను కలిసి అందజేసిన‌ట్లు తెలిపారు. ఈ పుస్తకంలో బ్రెజిల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ సమావేశాల్లో తాను పాల్గొన్న ఫొటోలు, ప్రసంగాలు, చర్చలు పొందుపరచడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రపంచ స్థాయిలో మహిళా సాధికారత, కృత్రిమ మేధస్సు (AI), వాతావరణ మార్పు, ప్రజాస్వామ్య విలువలు త‌దిత‌ర కీలక అంశాలపై జరిగిన చర్చల్లో భారతదేశం తరఫున స్వరం వినిపించడం నిజంగా ఆనందాన్ని ఇచ్చిందని ఎంపీ శబరి తెలిపారు.