Venigandla Ramu | గుడివాడ అభివృద్ధికి కృషి

Venigandla Ramu | గుడివాడ అభివృద్ధికి కృషి

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
  • గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

Venigandla Ramu | గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌భ : పశువుల పాకలో పుట్టిన ఏసుప్రభువు కష్టాలను ఇష్టంగా చేసుకొని సంతోషంగా జీవించారన్నారని, ఆయన చూపిన మార్గంలోనే ఎంత కష్టమైనా సరే గుడివాడ అభివృద్ధికి ఇష్టంగా పని చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు లోని గ్రేస్ గార్డెన్స్ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము – సుఖదా దంపతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ముందుగా మినిస్ట్రీస్ కన్వీనర్ రెవరెండ్ సజ్జ బర్నబాస్‌తో కలిసి ఎమ్మెల్యే రాము… క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవ సేవకులు, కూటమి నాయకులకు తినిపిస్తూ విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు.

వేడుకల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, వెనిగండ్ల ఫౌండేషన్ సభ్యులు దేవరపల్లి వినయ్, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్,సత్యసాయి, చేకూరు జగన్ మోహనరావు, దైవ సేవకులు, మినిస్ట్రీస్ సభ్యులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.

Leave a Reply