Car accident | కారు బీభత్సం…

Car accident | కారు బీభత్సం…
ఇద్దరు మృతి…
Car accident | రంగారెడ్డి, ఆంధ్రప్రభ : కారు బీభత్సం సృష్టించడంతో ఇద్దరు మృతిచెందగా, ఒకరికి గాయాలైన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మైలార్ దేవ్ పల్లి (Mailardevpally)లో కారు అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారు (Car ) లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
