Tahsildar | మాచవరం గ్రామరీ సర్వేకి అంతా ఓకే..

Tahsildar | మాచవరం గ్రామరీ సర్వేకి అంతా ఓకే..
Tahsildar | కోడూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమం కోడూరు మండల పరిధిలోని మాచవరం గ్రామంలో పూర్తయింది. గ్రామ సర్పంచ్ అప్పికట్ల లక్ష్మి అధ్యక్షతన గ్రామసభను తహసీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాచవరం గ్రామానికి సంబంధించిన డ్రాప్ ల్యాండ్ రిజిస్టర్‌ను ప్రచురించారు. రైతులందరూ వారి భూములు సంబంధించిన వివరాలను పరిశీలించుకున్నారు. డ్రాప్ లాండ్ రిజిస్టర్ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. తహసీల్దారు జలగం సౌజన్యకిరణ్మయ్య, డిప్యూటీ తహసీల్దార్ పద్మప్రియ, గ్రామ వీఆర్వో మణి బాబు తదితరులు పాల్గొన్నారు.
