Sarpanch | అధికార పార్టీతో అది సాధ్యం..

Sarpanch | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని.. అధికార పార్టీ వలనే అభివృద్ధి సాధ్యమవుతుందని బాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి వారసులు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, కొత్తకోట నేహా రెడ్డి, సిద్ధార్థరెడ్డిలు అన్నారు. భూత్పూర్ గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సంగీత శేఖర్ గౌడ్ ను ఆదరించి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని వారు గ్రామస్తులను కోరారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి బూత్పూర్ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల భూత్పూర్ ముక్కు గ్రామం పడ్డ ఇబ్బందులు నష్టాలను గ్రామస్తులకు వివరించి… అభివృద్ది తక్షణమే కావాలంటే కాంగ్రెస్ బలపరిచిన సంగీత శేఖర్ గౌడ్ ను సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.
పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. గ్రామంలో సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి మీ గ్రామానికి అండగా ఉన్నారని గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు. ప్రజల మద్దతుతో నిత్యం ప్రజల మధ్య ఉంటున్న కురుమయ్య గౌడ్ కుటుంబానికి అండగా నిలవాలని.. సర్పంచ్ గా సంగీత శేఖర్ గౌడ్ ను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కొత్తకోట నిహారెడ్డి, సిద్ధార్థ రెడ్డిలు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కే .కురుమయ్య గౌడ్, రఘుపతి రెడ్డి, భీమ్ సేన్ రావు, రాఘవేందర్ రెడ్డి, ఉప్పరి హనుమంతు, కె .చెన్నయ్య గౌడ్, బత్తలయ్య, వాకిటి నాగప్ప, కురువ నరసింహ, మాజీ ఉప సర్పంచ్ నరసింహ, కోరి నరసింహ, అంబర్నాథ్ అంజప్ప తదితరులు పాల్గొన్నారు.
