Bigg Boss Telugu 9 : ఆ ఐదుగురు ఎవ‌రో? తేలేది నేడే!

Bigg Boss Telugu 9 : ఆ ఐదుగురు ఎవ‌రో? తేలేది నేడే!

  • సుమ‌న్ శెట్టి అవుట్‌
  • సుమ‌న్ శెట్టి బాట‌లో భ‌ర‌ణి
  • మిగిలింది ఆ ఐదుగురే!

Bigg Boss Telugu 9 : వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బిగ్ బాస్ తెలుగు సీజన్ – 9 చివ‌రి వారానికి చేరుకుంది. నిన్న ఊహించ‌ని ప‌రిణామాల మ‌ధ్య సుమ‌న్‌శెట్టి(Suman Shetty)ని ఎలిమినేట్ చేస్తున్న‌ట్లు హోస్ట్ నాగార్జున అక్కినేని ప్ర‌క‌టించారు. సుమ‌న్ శెట్టి ఒక్క‌సారిగా ఎముష‌న‌ల‌య్యాడు. ఈ రోజు ఎవ‌రు ఎలిమేన్ అవుతారు? టాప్ 5 లో ఉన్న ఆ ఐదుగురు ఎవ‌రు అనేది చ‌ర్చ(discussion) మొద‌లైంది. ప్ర‌స్తుతం ఆరుగురు బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నారు. ఇప్ప‌టికే క‌ళ్యాణ్ ప‌డాల ఫైన‌ల్ లిస్టుకు చేరుకున్నాడు. ఇంకా నాలుగు ప్లేస్‌ల కోసం ఐదుగురు పోటీ ప‌డుతున్నారు. సెకండ్ ఫైన‌లిస్టులోకి వెళ్ల‌వ‌ల‌సిన త‌నూజ బిగ్ బాస్ ఆఫర్ వ‌దులు కోవ‌డంతో నామినేష‌న్‌(Nomination)లో ఉంది. ప్ర‌స్తుతం త‌నూజ‌, ఇమ్మ‌న్యుయేల్‌, డెమ‌న్ ప‌వ‌న్‌, సంజ‌నా భ‌ర‌ణి శంక‌ర్‌ ఉన్నారు.

Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్‌లో ఆగిన సుమ‌న్‌శెట్టి ప్ర‌భంజ‌నం

Bigg Boss Telugu 9

సుమారు మూడు వంద‌ల చిత్రాల్లో న‌టించిన సుమ‌న్‌శెట్టి 14వ వారం ఎలిమినేట్ అయ్యారు. అంద‌రూ ఊహించిన‌ట్లే ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తార‌ని హోస్ట్ నాగార్జున అక్కినేని(Nagarjuna Akkineni) ప్ర‌క‌టించారు. నిన్న నేరుగా సుమ‌న్‌శెట్టిని ఎలిమినేట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌ళ్ల‌లో నీరు తిప్పుకున్నాడు. అయితే ఇంటి స‌భ్యుల ఓదార్పు, పొగ‌డ‌తాల‌తో సుమ‌న్‌శెట్టి క‌ళ్ల‌లో నీరు ఆగిపోయింది. బిగ్‌బాస్‌లో సుమ‌న్‌శెట్టి ప్ర‌భంజ‌నానికి శుభం కార్డు ప‌లికింది. కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేషన్ హాట్ టాపిక్‌(Hot topic)గా మారింది. గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపకపోయినా, 14 వారాల పాటు హౌస్‌లో కొనసాగడం చర్చకు దారి తీసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచే సుమన్ శెట్టి గేమ్‌పై మిక్సడ్ అభిప్రాయాలు వచ్చాయి. టాస్కుల్లో పెద్దగా ప్ర‌భావం లేక‌పోయినా తన అమాయకత్వం, మంచితనం, కన్నింగ్ వ్యూహాలు(strategies) లేకపోవడంతో ఇంత‌వ‌ర‌కూ కొన‌సాగాడు.

Bigg Boss Telugu 9 : ఆ ఐదుగురు ఎవ‌రు?

బిగ్‌బాస్‌లో రేప‌టి నుంచి ఉండే ఆ ఐదుగురు ఎవ‌రు అనేది చ‌ర్చ కొన‌సాగుతోంది. మొద‌ట ఫైన‌ల్ లిస్టుకు వ‌చ్చిన క‌ళ్యాణ్ తోపాటు త‌నూజ‌, ఇమ్మ‌న్యుయేల్ స్థానాలు ప‌దిలం కానున్నాయి. అయితే డీమాన్ ప‌వ‌న్‌, సంజ‌నా, భ‌ర‌ణి శంక‌ర్ ముగ్గురులో ఈ రోజు ఎవ‌రు ఎలిమినేష‌న్ అవుతారు అనేది చ‌ర్చ ప్రారంభ‌మైంది. బిగ్‌బాస్‌లో రీతూ ఉన్నంత కాలం ఓటింగ్ ప‌రంగా డీమాన్ ప‌వ‌న్(Demon Pawan) వెనుక‌బ‌డి ఉన్నారని చ‌ర్చ సాగింది. గత వారం రీతూ ఎలిమినేట్ అయిన త‌ర్వాత ప‌వ‌న్ ముందంజ‌కు వ‌స్తున్నాడ‌ని స‌మాచారం. బ‌హుశ రీతూ త‌న ఓట్లు ప‌వ‌న్‌కు ప‌డుతున్నాయ‌ని ప‌లువురు భావిస్తున్నారు. రీతూ వెళుతూ.. వెళుతూ ప‌వ‌న్ క‌ప్ తేవాలి అని చెప్ప‌డం ఇందుకు కార‌ణం. మొద‌టి నుంచి సంజ‌నా నామినేష‌న్‌లో ఉంటున్నా సేవ్ అవుతూ వ‌స్తుంది. కాబ‌ట్టి సంజ‌నాకు ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు(Audience support) ఉంటుంద‌న్న‌ది వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బిగ్‌బాస్ స‌పోర్టు ఇస్తున్న భ‌ర‌ణి శంక‌ర్ మాత్రం కాస్తా వెనుక‌బ‌డి ఉన్నట్లు స‌మాచారం. వీరి ముగ్గురిలో భ‌ర‌ణి శంక‌ర్ ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప‌లువురు ప్రేక్ష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. దాదాపుగా భ‌ర‌ణి త‌ప్ప మిగిలిన వారు టాప్ 5 ఉంటార‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. చూద్దాం ఈ రోజు రాత్రికి!

CLICK HERE TO READ కేరళ రాజధానిలో కమల వికాసం

CLICK HERE TO READ MORE

Leave a Reply