Gudivada | ఇరుముడి పూజల్లో.. ఎమ్మెల్యే

Gudivada | ఇరుముడి పూజల్లో.. ఎమ్మెల్యే

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : అత్యంత నియమ నిష్ఠలతో మండల కాలం పాటు భక్తి శ్రద్ధలతో దీక్షలు ముగించుకున్న సర్వమాలాదారులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందనలు తెలిపారు. గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న భవాని దీక్షదారుల ఇరుముడి పూజల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షాదారులతో కొద్దిసేపు ఆయన మాట్లాడారు. అనంతరం గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్లను దీక్ష విరమణకు వెళ్తున్న, భవాని, అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ.. 41 రోజులకు పైగా భక్తి శ్రద్ధలతో దీక్షలు పూర్తి చేసుకుని, విరమణకు వెళుతున్న మాలాదారుల ఇరుముడి పూజల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఇరుముడి కట్టుకున్న దీక్ష దీక్షాదారులందరూ తమ మోక్కులను అమ్మవారికి సమర్పించి, తమ దీక్షలను సంపూర్ణంగా పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. దీక్షలు విరమించుకునే భక్తుల కోసం ఇంద్రకీలాద్రి పై ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఉండాలని ఎమ్మెల్యే రాము ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, చైర్మన్ పట్టపు చిన్న, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్రావు, జనసేన నాయకులు వేమూరి త్రినాథ్, భవాని, కోసూరి ఆంజనేయులు, పడాలి సౌమ్య, పవన్, షేక్ నాగూర్ భాష, మోటూరు విటల్ సాయి, దీక్ష దారులు పాల్గొన్నారు.

Leave a Reply