Gollapalli | ప్రచారంలో దూసుకెళ్తున్న శనిగారపు మల్లేశం..
గెలుపు బాటలో శ్రీరాముల పల్లె సర్పంచ్ అభ్యర్థి
Gollapalli | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి శనిగారపు మల్లేశం ప్రచారంలో ముందున్నాడు. గ్రామంలో ఎవరిని అడిగినా మల్లేష్ గెలుపు ఖాయమని చెప్తున్నారు. విద్యావంతుడు, బహుజన బిడ్డ, గతంలో సర్పంచ్ గా మూడు సార్లు చేసిన అనుభవంతో మల్లేశం గెలుపు పాటలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు తన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శనిగారపు మల్లేశం కోరారు. గ్రామంలో గల సమస్యలన్నింటిని మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గెలిచిన వెంటనే తీరుస్తానని గ్రామస్తులకు హామీ ఇస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు మల్లేశంకు మద్దతు తెలుపుతున్నారు.

