Ramadevi | జైన గ్రామాభివృద్ధి కోసం గెలిపించాలి..

Ramadevi | జైన గ్రామాభివృద్ధి కోసం గెలిపించాలి..

Ramadevi | ధర్మపురి, ఆంధ్రప్రభ : తనకు ఒక్క‌సారి సర్పంచ్ గా గెలిపిస్తే జైన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని జైన సర్పంచ్ అభ్యర్థి కట్ట రమాదేవి భువనేశ్వర్ తెలిపారు. ఇవాళ‌ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. విద్యావంతురాలైన తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి నిధులు తీసుకువచ్చి గ్రామంలో అభివృద్ధి చేపడతానని రమాదేవి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ వాటి ప‌రిష్కారం కోసం కృషి చేస్తానని.. ఒక్కసారి అవకాశం కల్పించి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. జైన గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపారు.

Leave a Reply