Narender | ఒక్క చాన్స్ ఇవ్వండి..

Narender | ఒక్క చాన్స్ ఇవ్వండి..
- అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా…
- సర్పంచ్ అభ్యర్థి చలిమేటి నరేందర్
Narender | నిజాంపేట, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇచ్చి గ్రామ సర్పంచ్‌గా గెలిపించాలని నిజాంపేట గ్రామసర్పంచ్ అభ్యర్థి చలిమేటి నరేందర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు గ్రామంలో నరేందర్ ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈనెల 14న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని, ఆ పార్టీ అభ్యర్థులను నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్నారు. నిజాంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నరేందర్ ను గెలిపిస్తే ఎంపీ రఘునందన్ రావు 25 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిద్ధరాం రెడ్డి, జాల పోచయ్య, తాళ్లపల్లి కిషోర్ గౌడ్, శివప్రసాద్, గరుగుల సుధాకర్, రమేష్, అరవింద్, నవీన్, గేరిగంటి బాబు, తదితరులు పాల్గొన్నారు.
