Aruna Raju Yadav | మీ ఇంటి ఆడపడుచును.. ఆదరించండి..

Aruna Raju Yadav | మీ ఇంటి ఆడపడుచును.. ఆదరించండి..

రామేశ్వరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
సర్పంచ్ అభ్యర్థి సాటు అరుణ రాజు యాదవ్


Aruna Raju Yadav | షాద్ నగర్, ఆంధ్ర‌ప్ర‌భ : మీ ఇంటి ఆడపడుచును.. నన్ను ఆదరించి.. ఒక్కసారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అవకాశం కల్పించాలని అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లకు మనసారా కోరుకుంటున్నాను.. రామేశ్వరం గ్రామపంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని రామేశ్వరం గ్రామపంచాయతీ అభ్యర్థి సాటు అరుణ రాజు యాదవ్ (Aruna Raju Yadav) అన్నారు.

రామేశ్వరం (Rameswaram)లో వాటర్ సమస్య లేకుండా తాగునీటి కోసం ఫిల్టర్ వాటర్ ను సరఫరా చేస్తానన్నారు. రామేశ్వరం గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, నీటి సమస్య వంటి అన్ని మౌలిక సదుపాయాలను సమకూరుస్తానన్నారు. రాయికల్ నుండి రామేశ్వరం వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తానని, అదేవిధంగా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తానని, ఎల్లప్పుడూ మీ మధ్య ఉంటున్న మీ చెల్లె లాంటి దాన్ని.. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి వస్తున్న.. రామేశ్వ‌రాన్ని అభివృద్ధి చేయాలని తపనతో ఉన్నాను నేను.. మమ్మల్ని ఆదరించండి.. ఆశీర్వదించి ఉంగరం గుర్తు కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు.

Leave a Reply