Belt shops | ఆకస్మిక తనిఖీలు…

Belt shops | ఆకస్మిక తనిఖీలు…
Belt shops | నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలో ఇటీవల జరిగిన మద్యం టెండర్లలో టెండర్ దక్కించుకొని కొత్తగా షాపులు ప్రారంభించిన మద్యం దుకాణాల లైసెన్సులు జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ.. మద్యం దుకాణదారులు గ్రామాలలో నిర్వహించే బెల్టు షాపుల(Belt shops)కు మద్యం అమ్మకూడదనీ, స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలకు, మతపరమైన ప్రార్థన మందిరాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్సైజ్ శాఖ(Excise Department) నుండి అనుమతి పొందిన అన్ని పత్రాలను తప్పకుండా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ నుండి అనుమతి తీసుకోవాలనీ జిల్లా ఎస్పీ సూచించారు.
