Vehicles | తనిఖీలు ముమ్మరం!

Vehicles | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు సర్పంచ్ ఎన్నికల(Election of Sarpanch) నేపథ్యంలో భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ ఎక్స్ రోడ్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. కార్లు ఇతరత్రా వాహనాలను(Vehicles) నిలిపి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

నిబంధనలు అధిక్రమించిన ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు(Legal proceedings) తీసుకుంటామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అశ్విన్ బాబు(Ashwin Babu) స్పష్టం చేశారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అందుకు సంబంధించిన రశీదులు వెంట ఉంచుకోవాలని సూచించారు. లేకుంటే నగదును సీజ్(Seize the cash) చేస్తామన్నారు. మద్యం అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉందని వెల్లడించారు.

ఎవరైనా ఎన్నికల నిబంధనలను అతిక్రమించినట్లు సమాచారం(information) ఇచ్చినట్లయితే తక్షణమే ఆ ప్రాంతానికి వచ్చి తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా(Details confidential) ఉంచుతామని వెల్లడించారు. ఆయన వెంట ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పురస్తు నరేష్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్నారం శ్రీనివాస్, వీడియో గ్రాఫర్ గంగాధర్, అధికారులు పాల్గొన్నారు.