Attack| భక్తుల పై దాడి

Attack| భక్తుల పై దాడి
Attack| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున(The Illusionary Mallikarjuna) స్వామి దేవస్థానానికి వచ్చిన భక్తులపై బుధవారం నీటి కుక్కలు దాడి చేసిన సంఘటన జరిగింది. రోజుకు కొన్ని వేల మంది భక్తులు శ్రీశైలంలోని పాతాళ గంగలో పుణ్య స్నానం (Pious position) ఆచరిస్తున్నారు. ఇలాంటి భక్తుల పై నీటి కుక్కలు దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఐదుగురు భక్తులను(Five devotees) ఒకేసారి నీటి కుక్కలు దాడి చేసాయి.

Attack | పాతాళ గంగలో పుణ్య స్థానానికి వెళ్లాలంటే..
గాయపడిన భక్తులు ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో చికిత్స తీసుకుంటున్నారు. పాతాళ గంగలో పుణ్య స్నానానికి వెళ్లాలంటే.. భక్తులు భయపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా పలువురు భక్తుల పై కుక్కలు దాడి చేయడం జరిగింది. దేవస్థానం అధికారులు నీటి కుక్కల నివారణ(Prevention of water dogs)కు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
