BRS| కేటీఆర్ సమక్షంలో..

BRS| కేటీఆర్ సమక్షంలో..

  • బీఆర్ఎస్ లో చేరిన‌ జన్నారం మాజీ జెడ్పీటీసీ

BRS| జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత ఎల్.బక్షినాయక్(Bakshinayak) ఇవాళ‌ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ (BRS party) నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ నాయకత్వంలో బక్షినాయక్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ బక్షినాయక్ కు బీఆర్ఎస్ పార్టీ గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బక్షినాయక్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి పాటుపడతానన్నారు.

Leave a Reply