కరెంటు వైర్ల దొంగలు అరెస్టు
కంకిపాడు, ఆంధ్రప్రభ : ఖాళీ వెంచర్లలోని కరెంట్ స్థంభాల కరెంట్ వైర్లను దొంగిలించిన ఇద్దరిని కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి మండలం పెనుమాకకు చెందిన గరికే చందు, యర్రబాలేనికి చెందిన నరసింహరాజు ను అరెస్ట్ చేసి రూ.3 లక్షల వైర్ల ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ సందీప్, మరో ఎస్ఐ సురేష్ ను అభినందించారు.
