BRS | ఊట్కూర్‌లో ఘనంగా దీక్ష దివాస్

BRS | ఊట్కూర్‌లో ఘనంగా దీక్ష దివాస్
BRS | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు శనివారం దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్ (Aravind Kumar) మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని, పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. స్వరాష్ట్ర సాధనలో ఎన్నో ఒడిదుడుకులతో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది పోరాటం చేశారని గుర్తు చేశారు. అనంతరం నారాయణపేట బీఆర్ఎస్ కార్యాలయంలో చేపట్టిన దీక్ష దివాస్ కార్యక్రమానికి గులాబీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. దీక్ష దివాస్ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులు కృష్ణ మినన్, మాలకృష్ణయ్య, బోయిని అనంతప్ప, తిమ్మారెడ్డి, కే కృష్ణయ్యలను మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతుబంధు మండలాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు ఆనంద్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
