Development | నామినేషన్ దాఖలు..

Development | నామినేషన్ దాఖలు..
Development | కోటగిరి, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. కోటగిరి గ్రామానికి చెందిన బర్ల మధుకర్(Barla Madhukar) సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను గ్రామస్థులతో కలసి పంచాయతీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో దాఖలు అందజేశారు.
నామినేషన్(Nomination) సమర్పించిన అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే(Village Development) తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.ఆయన వెంట బర్ల గంగారం, కొట్టం మనోహర్, మల్లిఖార్జున్ గ్రామస్తులు ఉన్నారు.
