AP | ధాన్యం కొనుగోలు కోసం..

AP | ధాన్యం కొనుగోలు కోసం..

AP, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజనులో రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8247693551 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ (Collector) డికె.బాలాజీ గురువారం సూచించారు. ఈ ఖరీఫ్ సీజనులో కనీస మద్దతు ధర ప్రతి క్వింటాల్ ధాన్యానికి సాధారణ రకం రూ.2,369 చొప్పున, గ్రేడ్-ఏ రకానికి రూ.2,389 చొప్పున ప్రతి రైతునకు పూర్తి పారదర్శకంగా నేరుగా వారి బ్యాంకు అక్కౌంట్ కు ఆధార్ నెంబరు ఆధారంగా జమ చేస్తామన్నారు. రైతులందరూ వారి ధాన్యాన్ని పూర్తిగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు.