Accident | ఓఅర్ఆర్ పై కారులో మంటలు

Accident |ఓఅర్ఆర్ పై కారులో మంటలు


డ్రైవర్ సజీవ దహనం..


Accident |శామీర్ పేట, ఆంధ్రప్రభ:
శామీర్ పేట ఓఆర్ఆర్ పై జరిగిన కారు ప్రమాదంలో మంటలు చెలరేగి.. కారులోనే డ్రైవర్ సజీవ దహనమైన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ మీద జరిగిన కారు ప్రమాదం (car accident) జనాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం రన్నింగ్ లో ఉన్న స్పోర్ట్స్ కారులో (In a sports car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిముషాల్లోనే కారు మొత్తం దగ్ధమైంది. కారు డ్రైవర్ బయటకు రాలేక కూర్చున్న సీటులోనే సజీవ దహనమయ్యాడు. సదరు డ్రైవర్ ఆస్తిపంజరం మాత్రమే మిగిలింది. ఘటనా స్థలానికి శామీర్ పేట పోలీసులు (Shamirpet Police) చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply