80 crore people | 80 కోట్ల మందికి ఉచితబియ్యం
80 crore people | 80 కోట్ల మందికి ఉచితబియ్యం
80 crore people | నల్గొండ, ఆంధ్ర ప్రభ : ఆహార భద్రతలో భాగంగా దేశంలోని 80 కోట్ల మంది(80 crore people) పేద ప్రజలకు ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి(Minister Pralhad Joshi చెప్పారు.
ఈ రోజు అయన నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ మహా విపత్తులో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆహార భద్రత కింద పేదలందరికి 5 కిలోల చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని, ఇది 2030 వరకు ఇది కొనసాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతినెల 5 కిలోల బియ్యం ఇవ్వటం లేదని అన్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ యూరోపియన్(Germany European) దేశాలలో సైతం ఇలాంటి పద్ధతి లేదని, భారత ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి ఇతర దేశాలు ఆశ్చర్యపోతున్నాయని, ప్రపంచంలోనే భారత ఆహార భద్రత పథకం మోడల్ గా తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ రాజు, ఎఫ్సిఐ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

