Makhtal | డిసెంబర్ 6న కోర్టు ప్రారంభోత్సవం

Makhtal | డిసెంబర్ 6న కోర్టు ప్రారంభోత్సవం

Makhtal | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ (Makhtal) లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కోర్టు ప్రారంభోత్సవం డిసెంబర్ 6న జరగనుంది. నారాయణపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు (Bar Association Lawyers) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.అనిల్ కుమార్‌ను కోర్టు ప్రారంభ తేదీపై కలిశారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన జస్టిస్ అనిల్ కుమార్ డిసెంబర్ 6న ప్రారంభోత్సవం నిర్వహించుకోవచ్చని సూచించారని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో మక్తల్ (Makhtal) న్యాయవాదులు ఆడెం శ్రీనివాసులు, రాజశేఖర్, భాస్కర్ గౌడ్, అరవింద్ కుమార్, మహేష్, భరత్, పోర్ల ఆనందు, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply