ZP | మానవత్వం చాటుకున్న జెడ్పీ చైర్పర్సన్

రోడ్డు ప్రయాణంలో గాయపడిన వాహనదారులకు సహాయం
ZP | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మానవత్వం చాటుకున్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం పర్యటనలో భాగంగా ఆదివారం ఆమె దెందులూరు జాతీయ రహదారిపై వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు జారి పడ్డారు. వెంటనే, చైర్పర్సన్ తన కాన్వాయ్‌ను ఆపి క్షతగాత్రులను పలకరించి, వారిని సమీప ఆసుపత్రికి తరలించేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. రహదారి పై ఉన్నగుంతలను చూసి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జాతీయ రహదారి శాఖ అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. రహదారిపై దారుణంగా ఉందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని జెడ్పీ చైర్ పర్సన్ ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

