Avuku rural | బలరామయ్య ఇక లేరు..

Avuku rural | బలరామయ్య ఇక లేరు..

Avuku rural, ఆంధ్రప్రభ : పట్టణ ప్రముఖుడు, మాజీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తాలేపల్లి బలరామయ్య (Thalepalli Balaramayya) (74) ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ మహబూబ్ నగర్ లోని ఓ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి ఈయన ఎంతో కృషి చేశారు. అప్పటి ఫ్యాక్షన్ రాజకీయాల్లో బిజ్జం సత్యం రెడ్డికి ఈయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. బలరామయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థ సారధి రెడ్డి, సీనియర్ నాయకులు ఐవి పక్కీర రెడ్డి, గూడాల మురళీధర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, ఉగ్రసేనారెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply