Nizamabad | ల్యాబ్ ఎంట్రీ చేయాలి…

Nizamabad | ల్యాబ్ ఎంట్రీ చేయాలి…

Nizamabad | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కామారెడ్డి జిల్లా(Kamareddy District) సహకార అధికారి రామ్మోహన్ చెప్పారు. ఈ రోజు బిక్కనూర్ మండలం అంతం పల్లి గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అక్కడ ఉన్నా వరి ధాన్యాన్ని పరిశీలించారు.

ఇప్పటివరకు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ(tab entry) చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ధాన్యం లోడ్ చేసి రైస్ మిల్లుకు పంపించాలని తెలిపారు. ఇట్టి విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దన్నారు గన్ని బ్యాగుల(Ganni Bagula) కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఆయన వెంట సొసైటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, సొసైటీ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్ సిబ్బంది రైతులు ఉన్నారు.

Leave a Reply