జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక.

జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక.
- రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించన పోలీస్.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పథకం సాధించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం గ్రామానికి చెందిన యువకుడు కుర్వ వీరేష్(Kurva Veeresh) తెలంగాణ పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ నెల 8, 9 రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో 92 కేజీల(92 kg in wrestling competitions) విభాగంలో బంగారు పతాకం సాధించాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. వచ్చే నెల 11వ తేది నుంచి 15వ తేది వరకు గుజరాత్లో నిర్వహించే పోటీలకు హాజరు కానున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలని గ్రామ పెద్దలు యువకులు అభినందిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన యువకుడు బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపిక కావడంతో మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్(Kiran Kumar), బిజెపి నాయకుడు వాకిటి వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు.
