ప్రైవేటు పాఠశాలల మధ్య పోటాపోటీ…

ప్రైవేటు పాఠశాలల మధ్య పోటాపోటీ…
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : జిల్లా స్థాయి అండర్ 14,17 కోకో పోటీల్లో రెండవ బహుమతి గెలుచుకుని సత్తా చాటారు దంతాలపల్లి అక్షర హైస్కూల్ పాఠశాల క్రీడాకారులు.ఈనెల 08వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ప్రైవేట్ పాఠశాలల కోకో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నర్సింహులపేట గ్రామానికి చెందిన పోలీస్ హోం గార్డు నయీంపాషా కూతుర్లు షైనాజ్, సనా ఇద్దరూ పాల్గొన్నారు.
ఈ జట్టుకు కోకో కెప్టెన్ గా షైనాజ్ వ్యవహరించడం విశేషం కాగా.. అటు అక్షర హైస్కూల్ పాఠశాల జమాన్యం, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు.. ఇటు నర్సింహులపేట మండల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ షైనాజ్, సనా ను అభినందించి ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నారు. ఈసందర్భంగా షైనాజ్, సనా మాట్లాడుతూ.. మమ్ములను ప్రోత్సహించిన యాజమాన్యానికి, వ్యాయామ కోచ్ అనిల్ కు ధన్యవాదాలు తెలిపారు.

