శ్రీ చరణి కి అపూర్వ స్వాగతం..

శ్రీ చరణి కి అపూర్వ స్వాగతం..

ఎన్టీఆర్ బ్యూరో, (ఆంధ్రప్రభ)
ప్రపంచ మహిళా క్రికెట్ కప్ కైవసం చేసుకోవడంలో భారత్ మహిళా క్రికెట్ టీంలో కీలకంగా ఉన్న శ్రీ చరణి కి అపూర్వ స్వాగతం లభించింది. ఇటీవల ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ను చిత్తుగా ఓడించి భరత్ కు మహిళ వరల్డ్ కప్పును మహిళా టీం అందించింది. ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చెందిన శ్రీ చరణి శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. మహిళా క్రికెటర్ శ్రీ చరణకి మహిళా మంత్రులు వంగలపూడి అనిత సబితా సంధ్యారాణిలు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు ఇచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

వీరితోపాటు ఏసీ అధ్యక్షుడు కేశినేని శివనాద్ కార్యదర్శి సానా సతీష్ బాబు ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్ సాప్ చైర్మన్ ఏ రవి నాయుడు స్వాగతం పలికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణ కీలక పాత్ర పోషించడం ఏపీ ప్రజలకు ఎంతో గర్వకారణంగా ఉందని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ వ్యాఖ్యానించారు. గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ఊరేగింపుగా శ్రీచరణి సీఎం చంద్రబాబు నాయుడుని కలవడానికి తాడేపల్లి వెళ్లారు. అయితే.. రహదారి పొడవున శ్రీ చరణి కోసం భారీ గా స్వాగత ఏర్పాట్లు చేశారు.

Leave a Reply