జూబ్లీహిల్స్ నుంచే మార్పు మొదలవ్వాలి..

  • హిందువుల ఓటుతో గుణపాఠం చెప్పాలి
  • దీపక్ రెడ్డి గెలిస్తే గుండాయిజం అంతమవుతుంది
  • బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు

బోరబండ, ఆంధ్ర‌ప్ర‌భ : హిందూ టైగర్ బండి సంజయ్ అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడారో ప్రజలకు తెలుసన్నారు. దీపక్ రెడ్డి గెలవాలని, అసెంబ్లీకి వెళ్లి మన గొంతు వినిపించాలని ఆకాంక్షించారు. బోర‌బండ ఎన్నిక‌ల స‌భ‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడారు.. హిందువుగా భాష, హిందువుగా ధర్మం, హిందువుగా సంస్కృతి, హిందువుగా స్వాభిమానాన్ని కాపాడాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

రేవంత్ రెడ్డి, ‘రేవంతుద్దీన్’గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందేనని విమర్శిస్తూ, రేవంతుద్దీన్‌గా మారినట్లుగానే మనం కూడా రేపు రహమత్ నగర్‌ను మీనాక్షి నగర్‌గా మార్చుదామని ప్రకటించారు. అసదుద్దీన్ అయినా, రేవంతుద్దీన్ అయినా, ఇంకేదైనా, మనం మాత్రం విడిపోవద్దని పిలుపునిచ్చారు.

ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని రేవంత్ రెడ్డి అంటున్నారని, మరి హిందువులు ఏమైపోవాలి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు హిందువులు కనబడరని, 80 శాతం హిందువులు ఉన్నప్పటికీ, 20 శాతం ఓట్ల కోసం పాకులాడే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మూడు పార్టీలకు గుణపాఠం నేర్పాలని కోరారు. మన ఓటు చాలా విలువైనదని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో మార్పు జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభం కావాలని అన్నారు. దీపక్ రెడ్డిని గెలిపించి, జూబ్లీహిల్స్ భవిష్యత్తును మార్చాలని, సమస్యల కోసం పోరాడే నాయకుడిని అసెంబ్లీకి పంపాలని కోరారు. దీపక్ రెడ్డిని గెలిపిస్తే గుండాయిజం, రౌడీయిజం అంతు చూస్తారని, ఎంఐఎం అండగా జరిగే అరాచకాలను అరికడతారని పేర్కొన్నారు.

Leave a Reply