మార్మోగిన శివనామస్మరణ

మార్మోగిన శివనామస్మరణ
ప్రకాశంలో కార్తీక శోభ
ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రకాశం జిల్లాలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటికీటలాడాయి. వేకువ జాము నుంచి శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ప్రధానంగా చీరాల కొత్తపట్నం పాకల బీచ్ ల వద్ద భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణ సందర్భంగా పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆర్టీసీ అధికారులు భక్తుల సౌకర్యార్థం అదనపు ఆర్టీసీ బస్సులను నడిపారు. మొత్తం మీద ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శివ క్షేత్రాలన్నీ శివనామ స్మరణలతో మార్మోగుతున్నాయి.
