పలువురికి తీవ్రగాయాలు

పలువురికి తీవ్రగాయాలు

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి(Kammarpally) మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ సమీపంలో జాతీయ రహదారి 63 పై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అతి వేగంగా వస్తున్న ట్రాక్స్ తుఫాన్ వాహనం ఆటోను ఢీ కొట్టింది. కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ ఖాదర్(Abdul Khader) తన ఆటోలో నాగపూర్ గ్రామం నుంచి పలువురు ప్రయాణికులతో కమ్మర్ పల్లికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

నాగపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆటోను ట్రాక్స్ తుఫాన్(Tracks Toofan) వాహనం ఢీ కొట్టడంతో ఆటోలోని ప్రయాణికులు కింద పడిపోయి తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా, అజాగ్రత్తగా ట్రాక్స్ తుఫాన్ వాహనాన్ని డ్రైవర్(Driver) నడిపి ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు, వారి బంధువులు తెలిపారు.

Leave a Reply