జయప్రదం చేయండి

బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్


ఉట్నూర్, అక్టోబర్ 27 (ఆంధ్రప్రభ) : బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ (JohnsonNayak), బి ఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఈ నెల 29న బుధవారం హలో విద్యార్థి చలో అదిలాబాద్ కలెక్టరేట్” ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాలని బి ఆర్ఎస్వి పార్టీ విద్యార్ధి విభాగం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ (Dharani Rajesh) కోరారు.

ఆయన సోమవారం మాట్లాడుతూ… పెండింగ్ లో ఉన్నఫీజురీయింబర్స్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు. విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విడుదల చేసే వరకు బిఆర్ఎస్వీ తరుపున మా పోరాటం ఆగదన్నారు.

Leave a Reply