ఇచ్చిన హామీని విస్మ‌రించి..

ఇచ్చిన హామీని విస్మ‌రించి..

వరంగల్ , ఆంధ్రప్రభ : బీఏఎస్ స్కాలర్‌షిప్‌(BAS Scholarship)లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ(AISF, PDSU), ఎంఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్, ఐక్య విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ కలెక్టరేట్(Collectorate) ఎదుట భారీ ధర్నానిర్వహించి, కలెక్టరేట్‌లో డీఆర్ఓ విజయలక్ష్మి(DRO Vijayalakshmi)కి వినతిపత్రం అందజేశారు.

విద్యార్థుల తరపున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మాట తప్పి, విద్యార్థి వర్గాల విశ్వాసాన్ని వమ్ము చేశారు. విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్ర ప్రభుత్వం, దిశా లేకుండా నడుస్తున్న ఓ గుడ్డి నౌకలా మారింది.

విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంద‌ని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు సమాజంలో మార్పుకు మూలస్తంభాలు. వారి సమస్యలను విస్మరించడం అనేది రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టే చర్య. పెండింగ్‌(Pending)లో ఉన్న అన్ని బీఏఎస్ స్కాలర్‌షిప్‌లను తక్షణం విడుదల చేయాల‌నీ, లేని పక్షంలో బీజేపీ విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుంద‌ని హెచ్చరించారు. విద్యార్థుల నినాదాలతో కలెక్టరెట్ ఆవరణలో మారుమోగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ కళాశాలల విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply