బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయం తెలంగాణ సర్కార్‌కు ఊరట కలిగించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమన్న జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు (High Court) స్టే ఇవ్వనందున సుప్రీంకోర్టుకు వచ్చామని పిటీషనర్ తరుఫున న్యాయవాది తన వాదనాలు వినిపించారు. హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది.
సుప్రీంలో బలమైన వాదనాలు వినిపించడానికి నిన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti Vikramarka Mallu), బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా నిర్వహించిన సంగతి విదితమే.

