అక్టోబర్ 1న సీఎం రాక

అక్టోబర్ 1న సీఎం రాక
- చెత్తలేని ఊరుగా ముస్తాబు
- అధికారలందరూ బిజీబిజీ
దత్తిరాజేరు, (విజయనగరం), ఆంధ్ర ప్రభ : అక్టోబర్ 1న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) విజయనగరం జిల్లాలో పర్యటించనున్ననేపధ్యంలో, దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి(S. Ramsunder Reddy) ఆదివారం పరిశీలించారు. ముందుగా హెలిపాడ్ స్థలాన్ని, మ్యాప్‌లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్(S. Sethu Madhavan), ఇతర అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు.
అనంతరం గ్రామంలో పర్యటించారు. యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని, కాలువను శుభ్రం చేయాలని, రోడ్లను మరమ్మతు చేయాలని, ప్రక్కనున్నగోతులను పూడ్పించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా(NTR Bharosa) సామాజిక పింఛన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనుండటంతో, లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి పేర్లను ఖరారు చేశారు.
బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్నికలెక్టర్ సందర్శించారు. స్టేజ్(Stage) ఏర్పాట్లపై చర్చించారు. వర్షాలు పడినా ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీఐపీ లాంజ్(VIP Lounge)ను పరిశీలించారు. వాహనాల పార్కింగ్(Parking)కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమీపంలో ఉన్నజెడ్పీ పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, అన్నిశాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు(APEPDCL SE Lakshmana Rao), ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఆర్ అండ్ బిఎస్ఈ కాంతిమతి (Kantimathi), పిఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్డర్ శ్రీనివాసరావు, డీపీఓ మల్లికార్జునరావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ప్రమీలా గాంధీ, ఆర్డీవో రామ్మోహన్, తహసీల్దార్ విజయభాస్కర్, ఆయా శాఖల ఇతర అధికారులు, కూటమి పార్టీల నాయకులు.పాల్గొన్నారు.

