కాంగ్రెస్ ప్రభుత్వం తీరు దారుణం

మానసిక క్షోభకు గురవుతున్న గ్రామ కార్యదర్శులు
రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పల్లెల్లో లోపించిన పారిశుధ్యం
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట సెప్టెంబర్ 25 (ఆంధ్రప్రభ): తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt) బతుకమ్మ ఉత్సవాలకు నిధులు కేటాయించకపోవడంతో ఉత్సవాలను నిర్వహించేది ఎలా అని గ్రామ కార్యదర్శి తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలకు సరిప‌డా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించక పోవడంతో పల్లెల్లో పారిశుధ్యం లోపించిందన్నారు. నిధులు కేటాయించకపోవడంతో బతుకమ్మ(Bathukamma) పండుగ నేడు కలతప్పింద‌న్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్ప‌డు బతుకమ్మ సంబరాలు ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించేవార‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) శ్రేణులు సమిష్టిగా బతుకమ్మ ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు చేయాలని, నాయకుల ఆర్థిక స్థోమతను బట్టి ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పిలుపునిచ్చారు.

పంచాయతీలకు నిధులు కేటాయించక పోవ‌డంతో డీజిల్‌కు డబ్బు లేక ట్రాక్టర్లు నడపడం లేదని, బ్లీచింగ్, పౌడర్ ఫాగింగ్, వీధిలైట్ల మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు. రెండేళ్లుగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవ‌డంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాక పంచాయతీలలో పాలకమండలి లేక బతకమ్మ ఉత్సవాలు క‌ల త‌ప్పాయ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కార‌ణంగా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అప్పులు తెచ్చి పారిశుధ్య‌ పనులు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply