ఉనికి చాటుకునేందుకే బీఆర్ఎస్ రాద్దాంతం

ఉనికి చాటుకునేందుకే బీఆర్ఎస్ రాద్దాంతం
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిత్యం ప్రజలలో ఉంటూ, అభివృద్దే లక్ష్యంగా ఆహర్నిశలు పాటుపడుతున్నభూపాలపల్లి(Bhupalpalli) ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ(Gandra Satyanarayana) పై బీ.ఆర్.ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ హెచ్చరించారు.
ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ(Congress Committee) ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి(Gandra Venkataramana Reddy)ల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ(PCC) సభ్యులు మధు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్(Battu Karnakar), ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతల్లి మధుకర్ రెడ్డి, సీనియర్ నాయకులు చల్లూరి సమ్మయ్య, మాజీ కౌన్సిలర్‌లు దాట్ల శ్రీనివాస్Datla Srinivas), సజ్జనపు స్వామి, చల్ల రేణుక, పానుగంటి హారిక, ముంజాల రవీందర్, అంబాల శ్రీను, సాంబమూర్తి, పైడిపల్లి రమేష్, శ్రీనివాస్, బౌతు రాజేష్, పొనకంటి శ్రీనివాస్, బౌతు రమేష్, మహేష్ రెడ్డి, నాగపురి సమ్మయ్య(Nagpuri Sammayya), సహాదేవ్, గురిజాల రవీందర్, మహేష్, సురేష్, మహిళ నాయకురాళ్లు మాలతి, పద్మావతి, కోమల, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
