కర్నూలు పోలీసులు నివాళి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వకర్మను ప్రపంచంలోనే తొలి వాస్తు శిల్పి(Architect)గా భావిస్తారని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్(SP Krishnamohan) అన్నారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి(Vishwakarma Jayanti) వేడుకను ఘనంగా జరిపారు. విశ్వకర్మ చిత్ర పటానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పుష్పాంజలి(Krishnamohan Pushpanjali) ఘటించారు.

అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా(Admin Hussain Peera), ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ, కష్టపడే తత్వం, పట్టుదల, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనే శక్తివంతమైన సందేశాన్నివిశ్వకర్మ ద్వారా మనం నేర్చుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలతో పాటు ఎఆర్ డీఎస్పీ భాస్కర్ రావు(Bhaskar Rao), ఆర్ ఐలు జావేద్, నారాయణ పాల్గొన్నారు.

Leave a Reply