విజయవాడ ఉత్సవ్ సన్నాహాలు
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో): అప్పుడే విజయవాడ(Vijayawada)లో దసరా సందడి ప్రారంభమైంది. మైసూరు(Mysore)లో దసరా ఉత్సవాల(Dussehra celebrations)ను మరపించే రీతిలో.. బెజవాడ(Bejwada)లోనూ అత్యంత వైభవంగా ఉత్సవాలు.. కాదు .. దసరా మహోత్సవాలను నిర్వహించి.. చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(MP Keshineni Shivnath) మహా కత్రువును చేపట్టారు. విజయవాడ నగరంలోని ఫార్చ్యూన్ మురళి హోటల్లో మంగళవారం విజయవాడ(Vijayawada) ఉత్సవ్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.

మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్
విజయవాడ ఉత్సవ్ ను ఏరీతిలో నిర్వహించాలి, ఎలా దిగ్విజయం చేయాలనే అంశాలపై ప్రజా పత్రినిధుల చర్చలు జరుగుతున్నాయి. ఈ భేటీలో అధ్యక్షుడు జిల్లా ఇన్ ఛార్జి మంతి సత్యకుమార్ యాదవ్(Satyakumar Yadav) మాట్లాడుతూ, 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందాం . అంతరించి పోతున్న కళలను పరి రక్షించుకుంటూ వేడుకలు నిర్వహిద్దాం . ప్రజలను ఇందులో మమేకం చేద్దాం. దసరా అంటే విజయవాడకు వెళ్లాలనిపించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. విజయవాడను పర్యాటకం(tourism)గా తీర్చిదిద్దటానికి ఈ వేడుకలు దోహదపడతాయి. ఈ ఏడాది మొదలు పెట్టిన చిన్న ప్రయత్నం ప్రపంచానికి పాకేలా చేస్తాం, ఈ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నాకు భాగస్వామ్యం కల్పించటం సంతోషం. దసరా అంటే దేశం అంతా విజయవాడ వైపు చూసేలా నిర్వహిద్దాం, మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం, అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య మాట్లాడుతూ, అయిదేళ్ల వైసీపీ అరాచక పాలనను(Five years of YCP anarchy) జనాలు చూశారు, ఈ పాలన వద్దని.. గట్టి తీర్పు ఇచ్చి కూటమిని గెలిపించారు అని అన్నారు. వైసీపీ అరాచకం నుంచి ప్రజల్లో గొప్ప ఆలోచన పుట్టి.. ప్రజారంజకగా పాలన ఇచ్చే ప్రభుత్వం వచ్చిందన్నారు. సినీ రంగానికి, వారి ఫంక్షన్ కు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా విజయవాడ ఉండేది, రానురాను ఆ సంసృతి తగ్గిపోయిందన్నారు.
దసరా అంటే బెజవాడే
20 ఎకరాల మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నిర్మాణం కోసం రూ.135 కోట్లు మంజూరు చేశారు. కానీ జగన్ వచ్చిన తర్వాత స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు.. కానీ నగర జనం బయటకు రావడం లేదు.. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలను బయటకు రప్పించాలి, అని వర్లరామయ్య సూచించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(MP Keshineni Chinni) మాట్లాడుతూ, కళలకు, సాంస్కృతిక రంగానికి రాజధాని విజయవాడ నగరం, కొన్ని కుళ్ళు రాజకీయాలు చేశారు.. అవి ఏమీ చేయలేవు, మీ అందరి సలహాలు, సూచనలను తీసుకొని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం, బెజవాడ ఖ్యాతిని ఖండఖండాలకు తెలియజేసేలా నిర్వహిస్తాం, విజయవాడ చరిత్ర అందరికీ తెలిసేలా చేస్తాం, అని ఎంపీ చిన్ని అన్నారు.

ఇదీ కనీవినీ ఎరుగని దసరా కార్నివాల్
విజయవాడ ఇంద్రకీలాద్రి(Indrakeeladri) కి దేశ విదేశాల నుంచి వస్తున్నారు, దసరా ఉత్సవాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో లక్షలాది మంది వస్తున్నారు, అమ్మవారి భక్తులకు.. విజయవాడ నగరం ప్రాముఖ్యత , కళల రాజధాని, సాంస్కృతిక రాజధాని గురించి… చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వినోదాన్ని, ఆధ్యాత్మకత పెంచేలా కార్యక్రమాలు చేపడుతామని ఎంపీ శివనాథ్ అన్నారు. గత 12 ఏళ్లుగా విజయవాడలో ఎగ్జిబిషన్ జరగలేదు, విజయవాడ ఎగ్జిబిషన్ అంటే బెజవాడ ప్రజల గుండెకాయ లాంటిది, ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహించి తీరుతాం అని ఎంపీ ఉద్వేగంగా అన్నారు. విజయవాడ ఎగ్జిబిషన్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, సంగీత కళాశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని ఎంపీ వివరించారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ అధికారులతో మాట్లాడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, మైసూర్ తరహాలో విజయవాడ ఉత్సవ్ ను నిరచించాలని, విజయవాడ దీపాల కళాకాంతుల తో కళకళ లాడలన్నారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ గురించి పెద్ద దసరా కార్నివాల్ నగరంలో నిర్వహిస్తున్నాం, భారత వైస్ ప్రెసిడెంట్ ను పిలవాలనుకుంటున్నాం, నిర్వీర్యంగగా ఉన్న కళలను జీవం తీసుకొస్తాం, లోకల్ టాలెంట్ కు ప్రాధాన్యం ఇస్తాం.. రోజు తొలుత రెండు గంటలు ప్రదర్శనలు ఉంటాయి, అని ఎంపీ వివరించారు. ఎగ్జిబిషన్ టిక్కెట్ అందరికీ అందుబాటులో 30 రూపాయలు పెడుతున్నాం, గొల్లపూడిలో దేవాదాయ శాఖ స్థలంలో నిర్వహించనున్న ఎగ్జిబిషన్ కు 56 రోజులకు 45 లక్షలు, రైతులకు 15 లక్షలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

