గోదావ‌రి న‌ది పురోహితుడు వినూత్న‌నిర‌స‌న‌

గోదావ‌రి న‌ది పురోహితుడు వినూత్న‌నిర‌స‌న‌

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : గోదావ‌రి న‌దిలో పూజ‌ల నిర్వ‌హ‌ణ‌కు(to management) అభ్యంత‌రం చెప్ప‌డంతో ఓ పురోహితుడు వాట‌ర్ ట్యాంక్ ఎక్కి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కాళేశ్వరం(Kaleshwaram) గ్రామానికి చెందిన ముమ్మడి రాకేష్ చారి నిత్యం గోదావరి నదిలో హస్తికల, పిండ ప్ర‌దాన‌ పూజలు నిర్వహిస్తారు. ఆదివారం బ్రాహ్మణ పూరోహితుల సంఘం నాయకులు కొన్ని రోజుల పాటు పూజలు చేయ‌వ‌ద్ద‌ని తెలిపారు.

య‌థావిధిగా పూజల కోసం గోదావరి నదికి(Godavari river) సోమ‌వారం వెళ్లిన ఇద్దరి పురోహితులను ఆ సంఘం నాయకులు అభ్యంత‌రం చెప్ప‌డంతో చారి అనే పురోహితుడు సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగాడు. అప్పటికి వారు నో చెప్పడంతో మనస్థాపానికి(for confidence) గురైన పురోహితుడు రెండు పెట్రోల్ బాటిల్స్‌తో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.

సమాచారం తెలుసుకున్నకాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి(SI Tamasha Reddy) సంఘటన స్థలానికి చేరుకోని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కూడా కిందికి దిగి రాలేదు. రెండు గంటలసేపు వాటర్ ట్యాంక్ పైనే ఉన్నాడు. స్థానికులు, పోలీసులు ఎంత నచ్చచెప్పినా కూడా వినకపోగా చివరకు బ్రాహ్మణ(Brahmin) సంఘం నాయకులు వచ్చి రేపటి నుండి నువ్వు గోదావరి నదికి వచ్చి యధావిధిగా పూజలు చేసుకోవచ్చని చెప్పడంతో కిందికి దిగి వచ్చాడు.

Leave a Reply