వీడిన కిడ్నాపర్ చెర

వీడిన కిడ్నాపర్ చెర
- భర్తకు లొకేషన్ షేర్ చేసిన మహిళ
- సినీ ఫక్కీలో కిడ్నాపర్ కారు చేజింగ్
- తిరుపతిలో తల్లి కూతురు కిడ్నాప్
తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : తిరుపతి నగరంలో ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. తల్లీకూతురు(mother and daughter)ను కిడ్నాప్ చేశారు. బాధితురాలు లోకేషన్ షేర్ చేయటంతో.. సినీ ఫక్కీలో పోలీసులు కారును ఛేజ్ చేసి.. కథను సుఖాంతం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల్ వద్ద రౌడీ షీటర్ అజీత్(rowdy sheeter Ajith), జిమ్ము పెట్టుకుని నిర్వహిస్తున్నాడు. తనకు పరిచయం ఉన్నమహిళను జిమ్(gym) దగ్గరకి రమ్మని ఫోన్ చేశాడు.
అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సమీపంలోని రౌడీషీటర్ అజీత్, ఆ మహిళను ఆమె కూతురిని కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి కొర్లగుంట వైపు అజిత్ అనుచరుడు బబ్లు వాహనంలో ఎక్కించుకొని వెళ్లాడు. తన మాట వినకపోతే చంపేస్తానంటూ(we will kill them) కత్తులతో బెదిరించారు.
మహిళ తన భర్త కు లోకేషన్ షేర్ చేయడంతో భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అప్రమత్తమై ఆ వాహనాలను వెంబడించేందుకు నగరంలో అన్నిప్రాంతాలను దిగ్బంధం చేసి పోలీసులు(police) వెంబడించారు. సినిమా తరహాలో కిడ్నాపర్లు వాహనాన్నిఅతివేగంగా వెళుతూ ఉండగా సమీప ప్రాంతంలో వాహనాలను డీ కొట్టారు.
దీంతో పోలీసులు కిడ్నాపర్లను(kidnappers) పట్టుకొని ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్ ఎందుకు జరిగింది? జిమ్ నిర్వాకుడు రౌడీ షీటర్ ఎందుకు కిడ్నాప్ చేశారు? దీనికి అసలు కారణం ఏంటీ? అనే దానిపై కూడా ఈస్ట్ పోలీసులు సమగ్రంగా(comprehensive) విచారణ చేపడుతున్నారు. దానికి తోడు రౌడీ షీటర్ అజిత్, రౌడీ షీటర్లు ఉండడంతో పాటు పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉండటంతో వాటిపై కూడా ఆరా తీస్తున్నారు.
